సెప్టెంబర్ 7వ తేదీన జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కనిగిరి పట్టణంలోని కందుకూరు రోడ్డులో గణేష్ విగ్రహాల అమ్మకాల కేంద్రం వద్ద విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. వివిధ రకాల సైజుల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబైన గణేష్ విగ్రహాలు ఉత్సవ కమిటీల నిర్వాహకులను ఆకట్టుకుంటున్నాయి.