గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ

69చూసినవారు
వినాయక చవితి పండుగను ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కనిగిరి సీఐ ఖాజావలి సూచించారు. కనిగిరిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మీడియా సమావేశంలో సిఐ మాట్లాడారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే ఉత్సవ కమిటీలదే బాధ్యత అన్నారు. నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్