కనిగిరి: ప్రమాదాలకు కారణమైన ఆవులను తరలించాలి

68చూసినవారు
రహదారి ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులను యజమానులు ఇళ్ల వద్దకు తరలించుకోకుంటే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పశుపోషకులను హెచ్చరించారు. కనిగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆవుల యజమానులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, స్పందించకుంటే వాటిని దూరంగా తీసుకువెళ్లి వదిలేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్