బాణాసంచా పేలి ఎమ్మెల్యే కంటికి గాయం

60చూసినవారు
బాణాసంచా పేలి ఎమ్మెల్యే కంటికి గాయం
కొండపి టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రచార కార్యక్రమంలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంలో ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చిన సందర్భంగా కార్యకర్తలు కాల్చిన బాణాసంచా పేలి ఆయన కంటికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనను ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కంటిని శుభ్రపరిచారు. ప్రమాదం ఏమీ లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్