సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు వద్ద ఆదివారం ఆగి ఉన్న కారును ఢీకొని ఆటో బోల్తాపడ్డ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ 108 వాహనంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ కొత్తపట్నం మండలం రాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ నెల్లూరులోని ఓ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.