టంగుటూరు: పాఠశాలలను తనిఖీ చేసిన కమిషన్ సభ్యురాలు

77చూసినవారు
టంగుటూరు: పాఠశాలలను తనిఖీ చేసిన కమిషన్ సభ్యురాలు
ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని వారు నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్