ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీ చించివేత కలకలం
కొరిశపాడు జాతీయ రహదారి వద్ద ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీకి చెందినవారు బాలినేని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసివున్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ బుధవారం చినిగి ఉండటం రాజకీయంగా కలకలం రేపింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ప్లెక్సీ చింపారా, ఏం జరిగింది అనే దానిపై తెలియాల్సి ఉంది.