పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సమయం దాటిపోయిన చిక్కిలను పంపిణీ చేయడంపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది విద్యార్థులు కాలం చెల్లిన చిక్కిలను గమనించకుండా తినేశారు. మరి కొంతమంది విద్యార్థులు దానిపై తేదీని గుర్తించి తినకుండా పడేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ విధంగా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.