పొదిలిలో: ఉప సర్పంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

71చూసినవారు
పొదిలిలో: ఉప సర్పంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉప సర్పంచ్ ఓంకార్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి సమయంలో పొదిలిలో ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఉపసర్పంచ్ ను మొదట పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఉప సర్పంచ్ పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్