మార్కాపురం: ఆకట్టుకున్న చిన్నారుల కోలాటం

74చూసినవారు
మార్కాపురంలోని ఎల్బీనగర్ శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. దసరా ఉత్సవాలలో భాగంగా రాత్రి భక్త ఆంజనేయస్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులలో కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కోలాట ప్రదర్శన స్థానిక ప్రజలను విశేషంగా ఆకర్షించింది.

సంబంధిత పోస్ట్