ప్రకాశం జిల్లాలో పక్షుల సందడి పట్టణ వాసులను కనువిందు చేసింది. మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన రాయలవారి నాటి కాలంలో నిర్మించిన పురాతన దేవస్థానం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన గాలిగోపురంగోపురం వద్ద పక్షులు వింతగా తిరుగుతూ సందడి చేశాయి. వాటిని గమనించిన స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గోపురం చుట్టూ పక్షులు చేస్తున్న ప్రదక్షిణ దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.