మార్కాపురంలోని సాధన డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై స్థానిక సీఐ సుబ్బారావు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలకు ఏ విధంగా వలవేస్తారో వివరించారు. మేము సూచించిన జాగ్రత్తలను ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేసి సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయాలన్నారు. ఇక సైబర్ నేరాల బారిన పడ్డవారు 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు సీఐ న్యాయం జరుగుతుందన్నారు.