ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రఖండ స్థాయి విజేతలు పాల్గొని, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. వక్తలు భగవద్గీత పోటీలు పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.