మార్కాపురం: ఆక్రమణల తొలగింపు

65చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని దేవాదాయ శాఖ భూములలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం సోమవారం ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారులు చేపట్టారు. 15 రోజులు క్రితం నోటీసులు ఇచ్చిన ఆక్రమణదారులు స్పందించకపోవడంతో అధికారులు జెసిబి సహాయంతో ఆక్రమణలను కూల్చివేశారు. ఎండోమెంట్ కమిషనర్ పానకల రావు దేవాదాయ శాఖ భూములలో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్