మార్కాపురం: ఆవు దూడను రక్షించిన అగ్నిమాపక శాఖ అధికారులు

65చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రాజ్యలక్ష్మి కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో ఓ ఆవు దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. శనివారం ఈ విషయం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు 3 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆవు దూడను సేఫ్టీక్ ట్యాంక్ నుంచి వెలికి తీశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఆవు పడిపోయినట్లుగా స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్