మహాత్ముడికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

51చూసినవారు
మార్కాపురంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పలు కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. ఉప్పు సత్యాగ్రహం, అహింస మార్గాలను అనుసరిస్తూ దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన గొప్ప మహానుభావుడని మహాత్మాగాంధీని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్