ప్రకాశం జిల్లా పొదిలి మండలం జువ్వలేరు గ్రామంలో సంక్రాంతి రోజు విషాదం నెలకొంది. మంగళవారం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామానికి చెందిన రైతు వెన్నుపూస శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి సంబంధించిన విద్యుత్ లైన్ ఫీజు పోవడంతో ఫీజు మారుస్తూ రైతు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.