మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పాటించేందుకు పట్టణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డి.ఎస్.పి నాగరాజు, సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాఫిక్ రూల్స్ పై ప్రకటనలు ఏర్పాటు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే నూతన రూల్స్ ప్రకారం అపరాధ రుసుములు విధించబడతాయని, అందుకే ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించి సహకరించాలని మార్కాపురం పోలీసులుగురువారం సూచించారు.