తర్లుపాడు: మరోమారు కొండవాగుకు వరద ఉధృతి

76చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడు సమీపంలోని కొండ వాగుకు మరోమారు వరద ఉధృతి నెలకొంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు శుక్రవారం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మార్కాపురం, తర్లుపాడు ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగు ఉధృతంగా ఉండడంతో వాగు దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దని స్థానిక అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కొండవాగు నీరంతా గుండ్లకమ్మ వాగుకు చేరుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్