అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ వి కె పి కళాశాల ప్రిన్సిపాల్ టీ.రంగారావుకి నివాళి.

2450చూసినవారు
అనారోగ్యంతో మృతి చెందిన ఎస్ వి కె పి కళాశాల ప్రిన్సిపాల్ టీ.రంగారావుకి నివాళి.
వి కె పి కళాశాలలో అధ్యాపకునిగా, ఎన్సిసి ఆఫీసర్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేసిన టి. రంగారావు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. ఈ సందర్భంగా ఎస్ వి కే పి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ సి సి విద్యార్థులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ వి కె పి కళాశాల వంశపారంపర్య అధ్యక్షులు యక్కలీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 1993 నుంచి గణిత శాస్త్ర అధ్యాపకునిగా, ఎన్సిసి ఆఫీసరుగా, ప్రిన్సిపల్ గా కళాశాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకమండలి సభ్యులు సకలా నరసింహులు, యక్కలి కాశీ విశ్వనాథ్, ఊటుకూరి మాధవరావు, ఫిజికల్ డైరెక్టర్ మిరియాల నాసరయ్య, భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, చరిత్ర అధ్యాపకులు పొన్నబోయిన ఆవులయ్య , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్