సబ్సిడీపై పండ్ల సాగుకు దరఖాస్తుకు ఆవకాశం: ఏపీఓ
నాగులప్పలపాడు మండలంలో ఉపాధి హామీ పథకంతో సన్న, చిన్న కారు రైతులకు 100% సబ్సిడీపై పండ్లు, పూల తోట సాగుకు చేయూత ఇస్తున్నట్లు ఏపీఓ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండ్ల తోటల్లో దానిమ్మ, సీతాఫలం, నేరేడు తదితర తోటల సాగుకు కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని ఆయన వివరించారు. అర్హులైన రైతులు పట్టాదారు పాసుపుస్తకంతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.