ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకోవద్దు

60చూసినవారు
ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకోవద్దు
చికిత్స కోసం ఎలాంటి విద్యార్హతలు లేని ఆర్ఎంపీల వద్దకు వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ఇంచార్జ్ డిఎంహెచ్ఓ సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రాథమిక వైద్యశాలల్లో క్వాలిఫైడ్ వైద్యులను నియమించటంతో పాటు, అన్ని రకాల వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్ఎంపీల వద్దకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్