సముద్ర తీరంలో నిమజ్జనానికి బారులు తీరిన గణనాథులు

66చూసినవారు
కొత్తపట్నం సముద్ర తీరంలో ఆదివారం నిమజ్జనానికి గణనాథులు బారులు తీరాయి. వినాయక చవితి పండుగ ఉత్సవాలలో భాగంగా 9వ రోజు కావడంతో వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో తరలి వచ్చాయి. నిమజ్జనం చేసే ముందు భక్తులు స్వామికి మొక్కులు చెల్లించారు. దాదాపుగా జిల్లాలోని అధిక సంఖ్యలో విగ్రహాలు ఆదివారం నిమజ్జనం చేశారు. కొత్తపట్నం సముద్ర తీరం వద్ద ఆదివారం అర్ధరాత్రి వరకు నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్