ఒంగోలు నగరంలోని మాత శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోగులకు వైద్యం అందించాలని తెలిపారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి పరిశీలించి, రోగులతో మాట్లాడారు.