ప్రకాశం డీఈఓ కీలక ఉత్తర్వులు

11982చూసినవారు
ప్రకాశం డీఈఓ కీలక ఉత్తర్వులు
ప్రకాశం జిల్లా లో పాఠశాలు తిరిగి ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌-4 నిబంధనలు పాటిస్తూ ఈనెల 21 నుంచి స్కూళ్లు తెరవనున్నారు. ఆమేరకు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు ఉ పాధ్యాయులు విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. అన్ని తరగతి గదుల ను శానిటైజ్‌ చేయాలన్నారు. ఉపాధ్యాయు లు మాస్కుతోపాటు చేతికి గ్లౌజులు కూడా వేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మాత్రం తరగతులు ఉండవు. ఇప్పటికే వి ద్యావారధి ద్వారా దూదర్శన్‌లో పాఠాలు బోధిస్తున్నందున వారికి ఏమైనా అనుమా నాలు ఉంటే ఉపాధ్యాయులు నివృత్తి చే యాల్సి ఉంటుంది.

షెడ్యూల్ ఇదీ..

ఈనెల 21న అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఈనెల 22 నుంచి కనీసం 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యేలా జాబ్‌ చార్టులు నిర్ణయించాలి. తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించి కొవిడ్‌ -19 నియంత్రణ గురించి వారిని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహించాలి. ఈనెల 22న మొదటి రౌండ్‌గా నిర్ణయించిన 50 శాతం మంది టీచర్లు స్కూళ్లకు హాజరై విద్యార్థులకు కార్యాచరణ ప్రణాళిక గురించి తెలియజేయాలి. 23న రెండో రౌండ్‌ 50శాతం మంది టీ చర్లు హాజరై కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను విద్యార్థులకు వివరించాలి. 24,26,29 తేదీల్లో మొదటి రౌండ్‌, 25,28,30 తేదీల్లో రెండో రౌండ్‌ టీచర్లు విద్యార్థులకు రెమిడియల్‌ తరగతులు నిర్వహించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్