Apr 26, 2025, 08:04 IST/
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం
Apr 26, 2025, 08:04 IST
హైదరాబాద్లోని హయత్నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రావినారాయణ రెడ్డి నగర్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగి చుట్టుపక్కలకు కూడా వ్యాపించాయి. దీంతో దాదాపు 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి సిలిండర్లు పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.