తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబ సభ్యులు హెచ్ బి ఏ 2 రక్త పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కంకణాల భాస్కర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 35 మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు జన్యుపరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి పేషెంట్ కుటుంబ సభ్యులకు వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు.