హైఎస్ట్ మెజారిటీతో ఎమ్మెల్యే ఏలూరి హ్యాట్రిక్ గెలుపు

1919చూసినవారు
పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఏలూరి సాంబశివరావు 24138 ఓట్లతో మంగళవారం విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుగురు ఎమ్మెల్యేలుగా పని చేశారు. అయితే 2004లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు 15 వేల ఓట్లతో గెలిచి అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు పొందారు. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే ఏలూరి ఆ రికార్డ్ ను అధిగమించి 24, 138 ఓట్లతో గెలిచి సరికొత్త రికార్డు సాధించారు. అభివృద్ధి ప్రదాతగా, సేవ తత్పరుడిగా, సౌమ్యుడిగా ప్రజాధరణ కలిగిన నేతగా ఎమ్మెల్యే ఏలూరి పేరు ప్రఖ్యాతలు పొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఆయన 10775 ఓట్లతో విజయం సాధించారు. వైసీపీ గాలిలో సైతం 2019లో జరిగిన ఎన్నికల్లో 1647 ఓట్లతో మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 24138 ఓట్లతో పర్చూరు నియోజకవర్గ చరిత్రలో కొత్త రికార్డుకు ఎక్కారు. తద్వారా ప్రజలంతా ఆప్యాయంగా సాంబన్న అని పిలుచుకునే ఎమ్మెల్యే ఏలూరి హ్యాట్రిక్ విజేతగా నిలిచారు.

సంబంధిత పోస్ట్