సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

77చూసినవారు
కారంచేడు మేజర్ పంచాయతీ సర్పంచ్ బాలిగ శివపార్వతి ఫిర్యాదుతో ఓవార్డు మెంబర్, ఉప సర్పంచ్, వారి అనుచరులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సోమవారం కేసు నమోదు అయింది. ఈనెల మూడో తేదీన తాను పంచాయతీ ఆఫీసులో ఉండగా నిందితులు మరో వార్డు మెంబర్ తో గొడవ పడుతుండగా సర్ది చెప్పబోయిన తనను వారు కులం పేరుతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడి చేశారని సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్