చీరాల: డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ

75చూసినవారు
చీరాల: డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ
పాపాయిపాలెంకు చెందిన పులి శ్రీనివాసరావు అనుమానాస్పద మృతి కేసులో అన్ని కోణాల నుండి విచారణ సాగిస్తున్నామని చీరాల డిఎస్పీ జగదీష్ నాయక్ చెప్పారు. పులి శ్రీనివాసరావుది హత్య అంటూ ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం చీరాలలో ఆందోళన నిర్వహించిన సందర్భంగా డీఎస్పీ అక్కడికి వచ్చి వారితో మాట్లాడారు. వారి అనుమానాలను ఆయన నమోదు చేసుకున్నారు. మూడు రోజుల్లో ఈ కేసులో నిజాలు బయట పెడతామని, అపోహలు అనవసరమన్నారు.

సంబంధిత పోస్ట్