బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు

85చూసినవారు
పర్చూరు లో పదుల సంఖ్యలో వీధి కుక్కలు చేరి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి పూట గుంపులుగా చేరి ఆరుస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రక్కనే నిలిపి ఉన్న వాహనాల కింద నక్కి ఒక్కసారిగా విరుచుకు పడుతున్నాయని వాహనదారులను కూడా వదలకుండా వాహనాల వెంట గుంపులుగా వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అన్నారు. అధికారులు కుక్కల సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్