డిసెంబర్ 5వ తేదీన ఉమ్మడి తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను 48 గంటల పాటు మూసి ఉంచే విధంగా ఏపీ ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.