దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందర్ విహార్ ప్రాంతంలో ఓ నైజీరియన్ మద్యం మత్తులో తన భార్యను హతమార్చాడు. సోమవారం ఆ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా కొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం స్థానికులు అతడిపై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. అతడిని పట్టుకుని కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.