విద్యుదాఘాతంతో గేదెలు మృతి

68చూసినవారు
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
విద్యు దాఘాతంతో సంతనూతలపాడు మండలం మద్దులూరులో ఆదివారం రెండు గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఇల్లా మోహనరావు తన ఇంటి ఆవరణలో వీటిని కట్టేశారు. సమీపంలోనే ఉన్న విద్యుత్ పరివర్తకం దెబ్బతినడంతో గేదెలు కట్టిన ప్రాంతం వరకు విద్యుత్ సరఫరా కావడంతో అవి మృతి చెందాయి. కొద్ది రోజుల క్రితమే సుమారు రూ. 1. 50 లక్షలు వెచ్చించి వీటిని కొనుగోలు చేశామని ఇప్పుడు జీవనోపాధి కోల్పోయామని బాధితుడు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్