ఘనంగా మాతృభాషా దినోత్సవ వేడుకలు
త్రిపురాంతకం గ్రంధాలయంలో గురువారం మాతృభాష దినోత్సవం సందర్భంగా కవి, రచయిత, శ్రీశ్రీ కళావేదిక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గిడుగు రామమూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి ఆధ్యులు మన గిడుగు. వ్యవహారిక పిడుగు అని, ఆయన చేసిన సాహిత్య సేవలను కొనియాడారు.