ఒక్కసారిగా గొయ్యిలో పడిపోయిన ట్రక్కు.. తృటిలో తప్పించుకున్న డ్రైవర్ (వీడియో)

51చూసినవారు
పూణేలోని సమాధాన్ చౌక్‌లోని శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన ట్రక్కు ఒక్కసారిగా గొయ్యిలో పడిపోయింది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగి ఉంది. అయితే ట్రక్కు ముందుకు కదిలింది. అంతలోనే తలక్రిందులుగా భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కుతో పాటు రెండు బైకులు కూడా పడిపోయాయి. అదృష్టవశాత్తూ, ట్రక్కు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్