శిథిలావస్థకు చేరిన గంగమ్మ తల్లి దేవాలయం

762చూసినవారు
శిథిలావస్థకు చేరిన గంగమ్మ తల్లి దేవాలయం
పుల్ల చెరువు గ్రామంలోని చిన్నకండలేరు ప్రాజెక్టు (కొత్తచెరువు )వద్ద గల గంగమ్మ తల్లి దేవాలయం దశాబ్దాల క్రితం ఏర్పడింది. ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు భక్తులు వెళ్లి మొక్కులు తీర్చుకోవడం తప్ప, ఆలయాన్ని ఎవరు పట్టించుకోవడంలేదని వాపోయారు.
గ్రామ పెద్దలు, ప్రాజెక్టు నిర్వహణ కమిటీ సభ్యులు ఆలయాన్ని పున నిర్మించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్