త్రిపురాంతకం ఎంపీటీసీకి వినతి అందజేత
104 వ్యవస్థను పీహెచ్సిల ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని జీవో నెంబర్ 7ను వర్తింపజేసి ప్రతినెలా ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని, ఇంతవరకు అరబిందో యాజమాన్యం నుండి రావల్సిన బకాయిలు, ఇంక్రిమెంట్లు అన్నీ వెంటనే చెల్లించాలని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం 104 డ్రైవర్ జొన్నలగడ్డ శేషారావు ఎంపీటీసీకి మాలాపాటి మోహన్ దాసుకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. 104 ఉద్యోగులకు న్యాయం చేయాలని శేషారావు కోరారు.