పెద్దారవీడు: తండ్రిపై కొడుకు దాడి
కన్నతండ్రిపై కొడుకు దాడి చేసిన ఘటన శుక్రవారం పెద్దారవీడులోని హనుమాన్ జంక్షన్ కుంటలో చోటుచేసుకుంది. నారాయణ రెడ్డి పేరు మీద ఉన్న ఓ ఇంటిని కొడుకు సత్యనారాయణ రెడ్డి తండ్రికి సమాచారం ఇవ్వకుండా ఇంటిని విక్రయించాడు. ఈ విషయం తెలిసి తండ్రి ప్రశ్నించడంతో కొడుకు పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ నారాయణరెడ్డిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.