ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల్లో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. కార్డు నమూనాను కళాశాలలకు పంపించారు. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్‌లో ప్రథమ సంవత్సరం వారికి లేత పసుపు, రెండో ఏడాది వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి, ఇవ్వాలని సూచించారు.