సైకో బ్యాచ్ విష ప్రచారం: మంత్రి లోకేష్

51చూసినవారు
సైకో బ్యాచ్ విష ప్రచారం: మంత్రి లోకేష్
తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ సైకో బ్యాచ్ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘చేతులు కడిగే సింకులో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే. విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఆ పని చేసింది. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారు.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you