ఏపీ డిప్యూటీ స్పీకర్, MLA రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే రాము అనుచరుడు తులసిబాబు అరెస్టు తర్వాత పరిణామాలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలనేది డిప్యూటీ స్పీకర్ రఘురామ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు టీడీపీ బాగా కలిసినవారే. అయితే తులసిబాబుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రఘురామ పార్టీని సైతం వీడే యోచనలో ఉన్నట్లు ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది.