వీఆర్‌లో ఉన్న పోలీసులను గత ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన అనిత ఈ అంశంపై మాట్లాడారు. పోలీసులను వీఆర్‌లో ఉంచితే గతంలో 50 శాతం జీతం ఇచ్చేవారన్నారు. అయితే గత ప్రభుత్వం కక్ష పూరితంగా పోలీసులను వీఆర్‌కు పంపి వారికి 3-4 ఏళ్లు జీతాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.