కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్

65చూసినవారు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్
TG: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెబుతున్న కేంద్రం విద్యార్థులకు అందే స్కాలర్షిప్ ల విధానాన్ని రద్దు చేసిందని సీతక్క విమర్శించారు. విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి బొట్టుపనే తప్ప బోనం లేదన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్