ఏపీలో 3 రోజులు వర్షాలు!

65చూసినవారు
ఏపీలో 3 రోజులు వర్షాలు!
AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. శని, ఆది, సోమ వారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులూ పడతాయని అంచనా వేసింది. మరోవైపు నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.3, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 40.2, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్