శ్రీరామ నవమి అనగానే తనకి ఒంటిమిట్ట ఆలయం గుర్తుకు వస్తుందని చంద్రబాబు అన్నారు. తమ హయాంలోనే ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. వైసీపీ వచ్చాక దేవాలయాలు, అర్చకులపై దాడులు పెరిగాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేవాలయాల రక్షణ, పవిత్రత కాపాడేందుకు ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.