AP: పరవాడలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ గ్యాస్ లీక్ ఘటన తనను కలిచివేసిందని మంత్రి సుభాష్ అన్నారు. ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సుభాష్ పేర్కొన్నారు.