ఏపీలోని 47 మండలాల్లో రేపు రెడ్ అలర్ట్

85చూసినవారు
ఏపీలోని 47 మండలాల్లో రేపు రెడ్ అలర్ట్
AP: రాష్ట్రంలో భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో APSDMA రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు అలాగే 199 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. శుక్రవారం కూడా 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 186 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలెవరూ బయటికి రావొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్