కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.