TDP ముఖ్య నాయకులతో శుక్రవారం సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టభద్ర ఓటర్ల నమోదును వచ్చే నెల 6 లోపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తున్న అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి ఎన్డీయే గెలిచేలా చూడాలన్నారు.